ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి గ్రామంలో జరిగింది. భిక్షమయ్య(45)పై అతని భార్య పదునైన ఆయధంతో విచక్షణా రహితంగా దాడి చేసింది. తీవ్రగాయాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్తను కిరాతకంగా చంపిన భార్య - భర్తను చంపిన భార్య
చివరి వరకు తోడుంటానని ప్రమాణం చేసిన భార్యే తన భర్తను దారుణంగా హతమార్చింది. పదునైన ఆయుధంతో విచక్షణా రహితంగా దాడి చేసి అతన్ని చంపింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
నల్గొండ జిల్లాలో భర్తను కొట్టి చంపిన భార్య
జిల్లాలోని పులిమామిడి గ్రామానికి చెందిన వడ్డెగోని భిక్షమయ్య రాత్రి అతని భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన భార్య పదునైన ఆయధంతో అతని మెడ, ముఖంపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి పెద్ద కొడుకు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకుంటామని తెలిపారు.
ఇది చదవండి:దుకాణం కూల్చివేతతో వివాదం.. పరస్పరం దాడులు