తెలంగాణ

telangana

ETV Bharat / crime

women cheating: పెళ్లైన మూడు రోజులకే గర్భవతి... వరుస పెళ్లిళ్లతో ముగ్గురికి వలపుటోపీ - latest news in vishaka district

ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి.. విషయం దాచి తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన మూడో రోజే విషయం తెలుసుకుని.. ఆమెను వదిలించుకున్నాడు. ప్రియుడి సలహాతో మరో వ్యక్తికి వలపు వల విసిరి లక్షల్లో సొమ్ము కాజేసింది. చివరికి అతడిని విడిచి పెట్టి మూడోపెళ్లి చేసుకుంది. చివరికి రెండో భర్త ఫిర్యాదుతో కటకటాలపాలైంది. ఈఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది.

kiledi
kiledi

By

Published : Aug 29, 2021, 9:32 AM IST

ప్రపంచ మొత్తం భారత వైవాహిక బంధానికి ఆకర్షితులవుతుంటే... కొన్ని ఘటనలు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయి. కాసుల వేటలో అందమే పెట్టుబడిగా... మాయ మాటలే అస్త్రలుగా.. వలపు వల విసిరి కాసులు కాజేస్తున్న కొన్ని ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఓ వైపు ప్రియుడితో సంబంధం నెరపుతూనే... తాళి కట్టిన వాడిని నిలువుదోపిడీ చేసిందో మాయలేడీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరుకు రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలైంది. ఇంతకీ ఆ కిలేడీ కథ ఏంటంటే..

ప్రేమించి... పెళ్లి చేసుకుని తనను మోసం చేసిన యువతిపై ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగి ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన విశాఖ జిల్లా గాజువాక పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. సీఐ మల్లేశ్వరరావు, బాధిత భర్త ప్రసాద్‌ వివరాల మేరకు... చినగంట్యాడకు చెందిన యువతిని గతేడాది డిసెంబరులో ప్రసాద్‌ పెళ్లి చేసుకుని లక్నో తీసుకెళ్లారు. అక్కడే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనిపించుకుని... దఫదఫాలుగా రూ.90 లక్షల వరకు తీసుకున్న యువతి గాజువాక వచ్చేసింది. మళ్లీ ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు గాజువాక వచ్చి ఆరా తీశాడు. అయితే అంతకుముందే ఆమెకు అగనంపూడి, గాజువాకకు చెందిన మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు తెలిసింది.

ఇదీ కథ...

విశాఖ జిల్లా చినగంట్యాడకు చెందిన ఓ యువతి ప్రియుడి కారణంగా గర్భం దాల్చించి. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె గర్భవతి అన్న విషయం పెళ్లైన మూడో రోజుకే భర్తకు తెలిసి... ఆమెను విడిచిపెట్టేశాడు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయిన ప్రియుడి దగ్గరకు వెళ్లి తనని పెళ్లి చేసుకొమ్మని అడిగింది. పెళ్లి చేసుకోవాలంటే... తన కుటుంబంలో ధనవంతుడైన ఓ వ్యక్తిని చూపించి.. ముందు అతని నుంచి వలపు వలతో సొమ్ము లాగాలని.. తర్వాత వివాహం చేసుకుందామని ప్రియుడు సూచించాడు. ఇద్దరూ కలిసి అతడి నుంచి అందిన కాడికి దోచుకున్నారు. ఈలోపు రెండో భర్తకు విషయం తెలిసిపోయింది. అక్కడి నుంచి ఆమె బయటికి వచ్చేసింది. తిరిగి ప్రియుడితో కలిసి మరో వ్యక్తిని వలపు వల వేసి.. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. చివరికి రెండో భర్త ఫిర్యాదుపై అడ్డంగా దొరికిపోయింది. నిందితురాలిపై ఐపీసీ 420, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు

ఇదీ చూడండి:CRIME: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. చివరికి..!

ABOUT THE AUTHOR

...view details