నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చెర్లపల్లిలో దారుణం జరిగింది. తాగొచ్చి డబ్బుకోసం వేధిస్తున్న భర్తను ఓ మహిళ హత్య చేసింది. గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మద్యానికి బానిసైన సాయికుమార్ డబ్బుకోసం భార్యను తరచు వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా భార్యతో గొడవపడ్డాడు. విసుగు చెందిన సునీత భర్త తలపై బండరాయితో కొట్టింది.
తాగొచ్చి వేధించిన భర్త... బండరాయితో కొట్టి చంపిన భార్య - తాగొచ్చిన భర్త తలపై బండతో కొట్టి చంపిన భార్య
మద్యానికి బానిసైన భర్త... డబ్బుకోసం పెడుతున్న వేధింపులు తాళలేక ఓ మహిళ భర్త తలపై బండరాయితో కొట్టి చంపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చెర్లపల్లిలో జరిగింది.
నిజామాబాద్ నేర వార్తలు,nizamabad crime news
మద్యం మత్తులో ఉన్న సాయికుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.