తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువతిని రక్షించిన రెస్క్యూ టీంకు అభినందనలు - తెలంగాణ వార్తలు

గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతిని రక్షించిన తెలంగాణ అడ్వెంచర్స్ అండ్ ఆక్వా టూరిజం ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త రెస్క్యూ టీంను ఏసీపీ ఉమేందర్ అభినందించారు. గోదావరి నదిలో త్వరలోనే తాము గజ ఈతగాళ్ల బృందం ఏర్పాటు చేస్తామని ప్రసన్న కుమార్ తెలిపారు.

యువతిని రక్షించిన రెస్క్యూ టీంకు అభినందనలు
యువతిని రక్షించిన రెస్క్యూ టీంకు అభినందనలు

By

Published : Feb 7, 2021, 12:14 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతిని రక్షించిన తెలంగాణ అడ్వెంచర్స్ అండ్ ఆక్వా టూరిజం ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త రెస్క్యూ టీంను బృందానికి ఏసీపీ ఉమేందర్ అభినందనలు తెలిపారు.

ఏదైనా కష్టపడి పట్టుదలగా సాధించాలని.. కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సీఐ శ్రీనివాస రావు సూచించారు. గోదావరి నదిలో త్వరలోనే తాము గజ ఈతగాళ్ల బృందం ఏర్పాటు చేస్తామని ప్రసన్న కుమార్ తెలిపారు. పోలీసుల అభినందన తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో రివర్ ఫ్రంట్ పోలీస్ శ్రీనివాస్, వెంకట్, గోపు సందీప్ పటేల్, ఏర్వసాయి వంశీ బెస్త పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం

ABOUT THE AUTHOR

...view details