తెలంగాణ

telangana

ETV Bharat / crime

Black fungus: బ్లాక్​ఫంగస్​ లక్షణాలతో మహిళ మృతి - వర్దన్నపేటలో బ్లాక్​ ఫంగస్​తో మహిళ మృతి

కొవిడ్​ మహమ్మారితో ఇప్పటికే పల్లెలు అతలాకుతలం అవుతుంటే రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్​ ఫంగస్​ కేసులు మరింత కలవరపెడుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో బ్లాక్​ ఫంగస్ హడలెత్తిస్తోంది. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన ఓ మహిళ బ్లాక్​ ఫంగస్​ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Telangana news
వరంగల్​ రూరల్​ వార్తలు

By

Published : Jun 1, 2021, 6:31 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలతో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన బొమ్మేర కేతమ్మ (55) గత నెల ఏడో తేదీన కొవిడ్​ బారిన పడింది. చికిత్స కోసం వరంగల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి వరంగల్​ ఎంజీఎంకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కేతమ్మ బ్లాక్​ ఫంగస్​ లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహానికి ఇల్లందలో పారిశుద్ధ్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఇదీ చూడండి:అధిక ఫీజులపై ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details