హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Madhapur accident: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం.. యువతి మృతి - యువతి మృత్యువాత
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిగ్నల్ వద్ద ఆగివున్న బైకును వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు.
నగరంలోని నేరేడ్మెట్కు చెందిన అజయ్(23), జెన్నిఫర్ మరియ డిక్రూజ్ ద్విచక్రవాహనంపై కొత్తగూడ నుంచి సైబర్ టవర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సీఐఐ జంక్షన్ వద్దకు రాగానే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగారు. రెప్పపాటులో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న జెన్నిఫర్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా.. అజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Godavari River: గోదావరిలో ఇద్దరు గల్లంతు.. నలుగురు సురక్షితం