Lady Died with Her Boy Friend In Nalgonda District: వివాహేతర సంబంధంతో ఒక్కటి కాలేమని భావించిన ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన తుమ్మల పెన్‌పహాడ్‌లో వెలుగుచూసింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహేతర సంబంధం వారిద్దరి ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. లావణ్య(35) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన మహేష్(25)లు వివాహేతర సంబంధం ఏర్పడింది. లావణ్యకు ఇదివరకే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
కౌలు రైతుగా వ్యవసాయం చేస్తున్న మహేష్‌తో లావణ్యకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితగా ఉండి ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉన్న లావణ్య, మహేష్‌లు కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో మనో వేదనకు గురైన ఇద్దరు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. శనివారం అర్థరాత్రి ఇంటి నుంచి బయట వచ్చి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.