ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. - suicide news in kishtampet
![ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12762853-468-12762853-1628856898592.jpg)
17:06 August 13
ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో తల్లి లావణ్యతో పాటు ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృత్యువాత పడ్డారు. చిన్న కుమారుడు హర్షవర్ధన్(6) ప్రాణాలతో బయటపడ్డాడు. బావి నుంచి బయటపడిన చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన కస్తూరి లావణ్య, భర్త సంపత్.. వారిద్దరి పిల్లలతో కలిసి కిష్టంపేటలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది కాలంగా వారిద్దరి మధ్య కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపం చెందిన లావణ్య.. తన ఇద్దరు పిల్లతో కలిసి వ్యవసాయబావిలో దూకింది. లావణ్య, గణేశ్ మృతి చెందగా చిన్న కుమారుడు హర్షవర్దన్ దూకే సమయంలో ఒడ్డుపై పడ్డాడు. దీంతో బావి నుంచి బయటకు వచ్చిన చిన్నారి.. జరిగిన సంఘటనను గ్రామస్థులకు తెలిపాడు. ఘటనపై రాయికల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు