ఆస్తికోసం తనను ఇంటినుంచి వెళ్లగొట్టేందుకు అత్తింటివారు చిత్రహింసలు పెడుతున్నారని ఓ మహిళ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త, మరిది, ఆడపడుచులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గండిపేట మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన సంజయ్‌తో ఏడేళ్ల క్రితం మానస వివాహం జరిగింది. అయితే ఐదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు సంజయ్ మృతి చెందాడు. అప్పటికి వారికో కుమారుడు. భర్త పోయినప్పటినుంచి మానస కుమారుడితో కలిసి అత్తగారింటిలోనే ఉంటోంది.
అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ - rangareddy crime news
భర్తపోయి బిడ్డతో కలిసి ఉంటున్న మహిళకు అండగా ఉండాల్సిన అత్తింటివారు.. వేధింపులతో మానశిక క్షోభకు గురిచేశారు. అత్త మరిది, ఆడపడుచుల ఆగడాలను తాళలేక ఓ మహిళ హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
woman who complained
అయితే ఇటీవల రెండో కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండడం వల్ల ఆస్తిలో వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో తనను బలవంతంగా నెట్టేస్తున్నారని మనస... అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి:ఎంపీడీవో కార్యాలయంలో వార్.. ఎంపీపీపై ప్రజాప్రతినిధులు ఫైర్