మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలకు చెంది సుందిళ్ల పోచమ్మ... క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని గ్రామానికి చెందిన కొందరు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది.
భూమిని ఆక్రమిస్తున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం - మంచిర్యాలలో మహిళ ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని కొందరు లాక్కోడానికి ప్రయత్నిస్తున్నారని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన పోచమ్మ క్రిమసంహారకమందు తాగి బలవన్మరణానికి యత్నించింది.
గ్రామానికి చెందిన పోచమ్మ దంపతులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం మూడుగుంటల భూమిని ఇచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన సుందిళ్ల రాము,లక్ష్మి దంపతులు తన భర్తకు అప్పుడప్పుడు మద్యానికి డబ్బులిచ్చి తమ భూమిని అక్రమంగా రాయించుకున్నారని ఆరోపించింది. గ్రామపెద్దల సమక్షంలో రెండు గుంటల భూమిని సుందిళ్ల లక్ష్మికి రాసివ్వాలని చెప్పగా అలాగే చేశామని... కానీ మొత్తం భూమిని తీసేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
ఇదీ చూడండి:మద్యం మత్తు.. మామపై కోపం... కన్నకొడుకునే చంపేసింది!