తెలంగాణ

telangana

ETV Bharat / crime

'అందంగా లేవు... అదనపు కట్నం కావాలి...' ఓ వివాహిత బలి! - తెలంగాణ వార్తలు

అదనపు కట్నం వేధింపులకు మరో వివాహిత బలైంది. పెళ్లై ఏడాది గడవక ముందే వేధింపులు తట్టుకోలేక ఆమె తనువు చాలించింది. కట్నం కావాలని ఒకవైపు... అందంగా లేవని మరోవైపు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడంతో చేసేది లేక ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

a-woman-suicide-due-to-dowry-harassments-at-patancheru-in-sangareddy-district
'అందంగా లేవు... అదనపు కట్నం కావాలి...' ఓ వివాహిత బలి!

By

Published : Mar 17, 2021, 9:39 AM IST

అదనపు కట్నం కావాలనే అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ మంజీరానగర్ కాలనీకి చెందిన శివయ్య కూతురు సరితకు పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తితో గతేడాది ఆగస్టు 13న వివాహమైంది.

ఓ వైపు కట్నం.. మరోవైపు అందంగా లేవని...

పెళ్లి సమయంలో రాఘవేందర్‌కు 5 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, సామాగ్రి కానుకలుగా ఇచ్చామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అయినా అదనపు కట్నం కావాలని... అందంగా లేవని భర్త రాఘవేందర్, అత్త లక్ష్మి, ఆడపడుచు రజితలు వేధించేవారని ఆరోపించారు. భర్త కుటుంబసభ్యులు సరితను చాలాసార్లు శారీరకంగా హింసించేవారని వాపోయారు. దీనిపై సరిత తల్లిదండ్రులు నచ్చజెప్పినా వారి ప్రవర్తన మార్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వేధింపులు భరించలేకే...

శారీరకంగా, మానసికంగా వేధింపులు భరించలేక మంగళవారం నాడు అత్తగారింట్లోనే ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది. భర్త రాఘవేందర్, అత్త లక్ష్మి, ఆడపడుచు రజితలే సరిత ఆత్మహత్యకు కారణమని ఆమె సోదరుడు అరుణ్ ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:అన్నను చంపిన తమ్ముడు.. ఆస్తి తగాదాలే కారణం!

ABOUT THE AUTHOR

...view details