తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: అత్తను హతమార్చిన అల్లుడు - తెలంగాణ వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడే అత్తను హతమార్చినట్లు స్థానిక సీఐ వెల్లడించారు. కర్రతో బలంగా కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

a woman murdered by son in law, woman murder case
చిన్నతాండ్రపాడులో మహిళ హత్య, అత్తను చంపిన అల్లుడు

By

Published : May 24, 2021, 2:11 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పరిధిలోని చిన్న తాండ్రపాడు గ్రామంలో తెలుగు సాలమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఆమె అల్లుడు దస్తగిరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆమె అల్లుడు దస్తగిరి కర్రతో కొట్టడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారని సీఐ పేర్కొన్నారు. కూతురిని నాలుగేళ్ల క్రితం కర్నూలుకు చెందిన దస్తగిరికి ఇచ్చి వివాహం చేశారని అన్నారు. కూతురు వాణికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు.

ఏడాది కాలంగా వాణిని దస్తగిరి వేధిస్తుండడంతో సాలమ్మ వారం రోజుల క్రితం తన కూతురు వాణి, పిల్లలను తీసుకొచ్చిందని వివరించారు. దస్తగిరి పిల్లల కోసం ఆదివారం వారి ఇంటికి వచ్చినప్పుడు... సాలమ్మ అడ్డురాగా కర్రతో బలంగా కొట్టినట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త రాముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:జాడిమల్కాపూర్ జలపాతాల వద్ద మృతదేహం.. ఒంటిపై గాయాలు!

ABOUT THE AUTHOR

...view details