రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడాలో దారుణం జరిగింది. తల్లిని సరిగా చూసుకోవడం లేదనే కారణంతో కట్టుకున్నభార్యనే కడతేర్చాడు ఓ భర్త. నిందితుడి తల్లి విషయంలో ఆ దంపతుల నడుమ రోజూ ఘర్షణలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. మద్యానికి అలవాటు పడిన రవి.. మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో భార్య గొంతు నులిమి చంపేశాడు.
తల్లిని సరిగా చూసుకోవడం లేదని భార్యను హతమార్చిన భర్త..! - తెలంగాణ వార్తలు
తల్లిని సరిగా చూసుకోవడం లేదనే కారణంతో భార్యను హతమార్చాడు ఓ భర్త. మద్యం మత్తులో భార్య గొంతు నులిమి చంపేశాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో వారి మూడేళ్ల బాబుకు తల్లి లేకుండా పోయింది. హైదర్గూడాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
తల్లిని సరిగా చూసుకోవడం లేదని భార్యను హతమార్చిన భర్త..!
ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామానికి చెందిన రవితో సమతకు 2017లో వివాహమైంది. రవి కారు డ్రైవర్గా పని చేస్తుంటాడు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం