పోడు భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో చోటు చేసుకుంది.
పురుగుల మందు తాగి.. ఓ మహిళ బలవన్మరణం
ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
చిన్న బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాయింబంధం గుత్తి కోయ గూడెనికి చెందిన పద్దం జోగయ్య, ఎర్రమ్మ దంపతులు కొంత కాలంగా పోడు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు పోడు భూమిలో సగం వరకు అటవీశాఖకు అప్పగించాల్సిందిగా గ్రామస్థులకు చెప్పి వెళ్లారు. ఈ విషయమై మనస్తాపానికి గురైన ఎర్రమ్మ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎర్రమ్మ మృతికి కారకులైన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బకట్ల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:గ్రీన్‌కార్డులపై ఆంక్షలు ఎత్తివేసిన బైడెన్