Cyber crime in hyderabad: ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ పేరుతో ఓ మహిళను సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. హైదరాబాద్కి చెందిన 55 ఏళ్ల మహిళతో ఫ్రెండ్షిప్ పేరుతో ఛాటింగ్ చేశారు. స్నేహానికి గుర్తుగా లండన్ నుంచి గిఫ్ట్ పంపిస్తున్నట్లు నమ్మించారు. అనంతరం దిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి టాక్స్ పేరుతో దశల వారీగా రూ.1.22కోట్లను వసూలు చేశాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన మహిళ... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఫేస్బుక్లో దోస్తీ.. రూ. కోటికి పైగా కుచ్చుటోపి
Cyber crime in hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పాత తరహాలో మోసాలకు పాల్పడటం కష్టంగా మారడంతో నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళతో ఫేస్బుక్లో ఛాటింగ్ చేసి... 1.22 కోట్ల రూపాయలను దండుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
Cyber crime in hyderabad
నైజీరియన్ సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీయుల నుంచి తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావని... అలా రిక్వెస్ట్లు వస్తే నైజీరియా సైబర్ గ్యాంగ్ నుంచి అని గ్రహించాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: