attack on tahsildar office: తహసీల్దారు కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం - తెలంగాణ తాజా వార్తలు
15:42 September 01
తహసీల్దారు కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం
సిద్దిపేట జిల్లా కొండపాక తహసీల్దార్ కార్యాలయానికి నిప్పు పెట్టి అవే మంటల్లో ఆత్మహత్య చేసుకునేందుకు లక్ష్మీ అనే మహిళా రైతు యత్నించింది. దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన లక్ష్మికి, తన తండ్రికి.... రవీంద్రనగర్ గ్రామంలో 22 గుంటల భూమి ఉంది. ఈ భూమిని కొండపాక తహసీల్దారు... అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరిట పట్టా మార్పిడి చేశాడని ఆగ్రహంతో... పెట్రోల్‌తో కార్యాలయానికి నిప్పు పెట్టి, తానూ... ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.
కొండపాక ఎమ్మార్వో లంచం తీసుకుని తన భూమిని వేరే వారి పేరుపై పట్టా చేశారని లక్ష్మి ఆరోపించింది. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భూమిని తనకు ఇప్పించాలంది. కోర్టులో కేసు నడుస్తుండగా.... పట్టా ఎలా చేశారని నిలదీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.... తహసీల్దారు కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు యత్నించిన లక్ష్మిని అడ్డుకున్నారు.
ఇదీ చూడండి:Young Woman Suicide: ఆ పని తప్పని చెప్పినందుకు ఉరేసుకుని చనిపోయింది!