వరంగల్ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జిల్లాలోని కరీమాబాద్ ఎస్.ఆర్.ఆర్ తోటకు చెందిన మౌనిక, రాజు దంపతులు. కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మౌనిక మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివాహిత మృతి.. భర్తే కారణమా..? - ktelangana latest news
అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Breaking News
మృతురాలిని భర్తే హత్య చేసి.. ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ఇదీ చదవండి:ఆదివాసీల పెళ్లి అదుర్స్.. ఎడ్ల బండ్లే కట్న కానుకలు