సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోమరబండకు చెందిన జానకమ్మ(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాగుడుకు బానిసైన ఆమె కుమారుడు జగదీశ్ చారికి, తల్లికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెప్పారు. నిత్యం మద్యం సేవించి తల్లితో గొడవకు దిగేవాడని తెలిపారు. శుక్రవారం సాయంత్రం తల్లి ఆరోగ్యం బాగాలేదని అతను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
కోమరబండలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - woman died news in suryapet district
సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![కోమరబండలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి woman died in komarabanda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10701933-284-10701933-1613804254119.jpg)
కోమరబండ, మహళ మృతి
అయితే తాగిన మైకంలో కన్నతల్లిని హత్య చేసి ఉంటాడా అనే అనుమానం వ్యక్తం చేస్తూ శనివారం ఉదయం డయల్ 100కు గ్రామస్థులు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జగదీశ్ చారిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ నిమిత్తం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.