ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను డీసీఎం ఢీ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరుకులు కొని...

హయత్‌నగర్‌కు చెందిన దంపతులు సరుకుల కోసం డీమార్ట్‌కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోనగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వారిని ఢీ కొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:భగ్గుమన్న కారు.. నడిరోడ్డుమీదే బుగ్గిపాలు