Woman Dies Due To Electric Shock: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన మహిళపై విద్యుత్ తీగలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో తిప్పయ్య గారి సువర్ణ (40) వరి పంటలో కలుపు పనులు చేసేందుకు వెళ్లారు. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. 11కేవీ విద్యుత్ తీగ పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ తీగ మీద పడి.. అక్కడిక్కడే మహిళ మృతి
Woman Dies Due To Electric Shock: విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ మధ్య విద్యుత్ తీగలు తెగిపడి రైతులు చనిపోతున్న ఘటనలు అధికమయ్యాయి. ఇటీవల ఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లాలో పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి వెళ్లి.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు రైతులు మృతిచెందిన ఘటన మరువక ముందే.. అనంతపురం జిల్లాలో పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చే సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి పడటంతో.. నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయపడ్డారన్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ జిల్లాలో 11కేవీ విద్యుత్ తీగ మీద పడి మహిళ మృతి చెందింది.
Woman Dies Due To Electric Shock