woman died at Pargi : వైద్యం వికటించి మహిళ మృతి చెందిందటూ బాధిత కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ ఇంటిని ముట్టడించారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే మహిళ చనిపోయిందని ఆరోపిస్తున్నారు.
woman died at Pargi : మహిళకు ఆర్ఎంపీ ఇంజెక్షన్.. వైద్యం వికటించి మృతి! - తెలంగాణ వార్తలు
![woman died at Pargi : మహిళకు ఆర్ఎంపీ ఇంజెక్షన్.. వైద్యం వికటించి మృతి! woman died at Pargi, pargi crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14259378-898-14259378-1642915070008.jpg)
10:32 January 23
పరిగిలో వైద్యం వికటించి మహిళ మృతి
మల్లెమోన్ గూడకు చెందిన తస్లీం(38) అనారోగ్యంతో బాధపడుతూ.. వికారాబాద్ జిల్లా పరిగిలోని శివసాయి క్లినిక్కు శనివారం రాత్రి వచ్చింది. అక్కడ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ నర్సింహారెడ్డి ఆమెను పరిశీలించి అడ్మిట్ చేసుకొని... సెలైన్ బాటిల్ పెట్టారు. తస్లీం ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో ఇంజెక్షన్ ఇచ్చాడని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే తస్లీం మృతి చెందిందని పేర్కొన్నారు.
ఆర్ఎంపీ ఇంటి వద్ద ఆందోళన
ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని నర్సింహారెడ్డి సూచించగా.. అప్పటికే తస్లీం మృతి చెందిందని బోరున విలపించారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైద్యుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:Thief died at chandrayangutta: కట్టుకున్న లుంగీనే ప్రాణం తీసింది..