అమ్మాయి పుట్టిందన్న కారణంతో అత్తమామ, ఆడపడుచుతో సహా భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీలోని గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన పర్వీన్‌కు 2017లో విశాఖ గంగవరం పోర్టులో పనిచేస్తున్న ఇంజినీర్‌తో పెద్దలు వివాహం జరిపించారు. తొలి కాన్పులో ఆమెకు అమ్మాయి పుట్టింది. అప్పటి నుంచి భర్తతోపాటు అత్తమామలు తనను వేధిస్తున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ గ్రీవెన్సు సెల్‌ను ఆశ్రయించింది.
'పదేపదే అబార్షన్లు... పోలీసులూ వారికే మద్దతు' - గుంటూరులో భర్తపై భార్య ఫిర్యాదు
ఆడపిల్ల పుడుతుందనే భయంతో.. అత్తింటివారు వరుస అబార్షన్లు చేయిస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటివారు వేధిస్తున్నారని ఏపీలోని గుంటూరు గ్రామీణ ఎస్పీ గ్రీవెన్సు సెల్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే భర్తపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేయలేదని వాపోయింది.
'పదేపదే అబార్షన్లు చేయిస్తున్నారు.. చర్యలు తీసుకోండి'
రెండోసారి ఆడపిల్ల పుట్టకుండా ఫ్యామిలీ ప్రైవేటు డాక్టర్‌తో రెండుసార్లు ఆబార్షన్ చేయించారని వాపోయింది. తన భర్తపై ఫిర్యాదు చేస్తే పోలీసులు.. ఇంతవరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. మామ విశ్రాంత పోలీసు అధికారి కావడమే ఇందుకు కారణమని ఆమె ఆరోపించింది. తన భర్త, అత్తమామల వేధింపుల నుంచి రక్షణ కావాలని ఆమె కోరారు.