Loan App Harassment: ఆన్‌లైన్ లోన్ యాప్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. అడగకుండానే రుణాలు ఇచ్చి.. అనంతరం గడువుకు ముందే తిరిగి చెల్లించాలని లేదంటే.. పరువు తీస్తామని వేధించడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన సునీత అనే ఇన్టాఫండ్ ఫైనాన్స్‌లో రుణం తీసుకుంది. అయితే ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు ఫోన్లో సునీతతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చెేసుకుంది. మృతురాలు అలియాబాద్‌లో బైక్ జోన్ షోరూమ్ నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.