తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - భర్తను హత్య చేసిన భార్య

WIFE KILLED HUSBAND WITH LOVER HELP
WIFE KILLED HUSBAND WITH LOVER HELP

By

Published : Aug 2, 2022, 11:41 AM IST

Updated : Aug 2, 2022, 12:39 PM IST

11:36 August 02

సిర్పూర్ టి మండలం ఇటుకల పహాడ్‌లో వలసకూలీ హత్య

వివాహేతర సంబంధాలు.. దాంపత్య బంధాన్ని కడతేర్చుతున్నాయి. ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలం ఇటుకల పహాడ్‌లో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అటవీశాఖ ప్లాంటేషన్​లో కూలీ పనుల కోసం దేవేందర్, పార్వతి అనే దంపతులు మధ్యప్రదేశ్​ నుంచి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే పార్వతికి రామ్​లాల్​ అనే యువకుడి పరిచయం ఏర్పడింది అది కాస్తా ప్రేమగా మారింది. గత ఆదివారం భార్య పార్వతి ప్రియుడు రామ్​లాల్​తో ఏకాంతంగా ఉండడం చూసి దేవేందర్ పార్వతిని మందలించాడు.

దీంతో ప్రశ్నించిన భర్తను భార్య పార్వతి ప్రియుడుతో కలిసి కర్రతో బాది గొంతునలిమి హత్య చేశారు. తాగిన మైకంలో మొత్తం ఘటనను తోటి కూలీలకు రామ్​లాల్​ చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 2, 2022, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details