తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్య గొడ్డలి వేటుకు భర్త బలి..! - భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం కొర్లకుంటలో దారుణం జరిగింది. దంపతుల మధ్య జరిగిన తగాదాలో భార్య... భర్తను కిరాతకంగా నరికి చంపింది.

Telangana news
murder

By

Published : Jun 3, 2021, 12:06 PM IST

దంపతుల మధ్య మొదలైన మాటల యుద్ధం ప్రాణం తీసుకునేంతవరకు వెళ్లింది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో గొడ్డలికి బలయ్యాడు భర్త. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటలో జరిగింది.

గ్రామంలోని శ్రీపాద కాలనీలో నలుబోతుల కిష్టయ్య దంపతులు ఉంటున్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. తెల్లారేసరికి కిష్టయ్య రక్తపు మడుగులో పడిఉన్నాడు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తనపై దాడి చేయడానికికొచ్చిన భర్తతో పెనుగులాడుతుండగా గొడ్డలిపై పడి మృతి చెందాడని భార్య తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details