మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విజయలక్ష్మి అనే మహిళ తన భర్తను రోకలి బండతో మోది హతమార్చింది.
గ్రామానికి చెందిన మురళి, విజయలక్ష్మి దంపతులు. ఏడాది క్రితం ఆటో ఢీకొనడంతో మురళి కాలు విరిగింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో పిల్లల పోషణ విషయమై గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో విజయలక్ష్మి భర్త తలపై రొకలి బండతో బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావంతో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు.