ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడుతో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య(wife murdered her husband) చేసింది. వివాహేతర సంబంధం కారణంతో ఈ హత్య జరిగినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన రామయ్య - జయలక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే జయలక్ష్మి.. అదే గ్రామానికి చెందిన కైజర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో కైజర్, జయలక్ష్మి ఇద్దరు కలిసి గత నెల 13న రామయ్యను హత్య చేశారని డిఎస్పీ తెలిపారు.
Murder: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఏమీ తెలియనట్లు... - a wife murdered her husband at uyyalavada
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడుతో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య(wife murdered her husband) చేసింది. గత నెల 13న ఈ ఘటన జరగ్గా... పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హత్య చేసిన పదిరోజుల తరువాత జయలక్ష్మి.. తన భర్త రామయ్య కనపడటంలేదని ఓర్వకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో రామయ్యను అతని భార్యనే హత్య చేసినట్లు తేలింది. హత్య అనంతరం మృతదేహాన్ని హెచ్ఎన్ఎస్ఎస్(HNSS) కాల్వలో పడేసినట్లు తెలియడంతో పోలీసులు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. రామయ్య మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు పాల్పడిన జయలక్ష్మి, కైజర్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:ప్రేమకు అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె