నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని నల్లమల అడవిలో పారేసింది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేషగూడెం గ్రామానికి చెందిన మాణిక్యరావుకు ముగ్గురు సంతానం. ఇతని భార్య యాదయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఈ నెల 13న భర్త మాణిక్యరావును చంపేసింది. అనంతరం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ సమీపంలోని నల్లమలలోని దర్గా సమీపంలో మృతదేహాన్ని పడేశారు.
మాణిక్యరావు కనిపించకపోవడంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మాణిక్యరావు భార్య తీరుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన ప్రియుడు యాదయ్యతో కలిసి భర్త మాణిక్యరావును హత్య చేసి మృతదేహాన్ని నల్లమల అడవిలో పడేసినట్లు ఒప్పుకుంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మాణిక్యరావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాబాద్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: Road Accident: పెళ్లింట విషాదం... నవవధువు, ఆమె తండ్రి దుర్మరణం