వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ప్రియుడు/ప్రియురాలు మోజులో పడి.. పలువురు కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడి ఎల్లారెడ్డిలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని చంపేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని అంతమొందించింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పూడ్చిపెట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - wife killed her husband in yellareddy
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
10:58 July 07
భర్త మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పూడ్చిపెట్టిన భార్య
Last Updated : Jul 7, 2022, 11:56 AM IST