తెలంగాణ

telangana

ETV Bharat / crime

చికెన్‌ వడ్డించలేదని ఆగిన పెళ్లి.. - తెలంగాణ తాజా వార్తలు

ఇదేం విచిత్రమండీ బాబు.. ఎక్కడైనా కట్నం చాలలేదనో.. ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం. కానీ ఇక్కడ మాత్రం పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదని పెళ్లి ఆగిపోయింది. ఇది ఎక్కడ జరిగిందంటే..?

Wedding Stopped
Wedding Stopped

By

Published : Nov 29, 2022, 9:18 AM IST

కట్నం చాలలేదనో.. ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం.. కానీ, చిత్రంగా పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్‌ వడ్డించలేదంటూ ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌ షాపూర్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు.

షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లివారు బిహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. విందు ముగింపు దశలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్‌ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లికుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి.. విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాల వారిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం ఈ నెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details