శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో దారుణ హత్య జరిగింది. ఓ కంపెనీ వాచ్మెన్పై మరో కంపెనీ వాచ్మెన్ కత్తితో దాడి చేశాడు. ఘటనలో అమ్రాన్ షా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
వాచ్మెన్పై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
ఓ కంపెనీ వాచ్మెన్పై మరో కంపెనీ వాచ్మెన్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వాచ్మెన్పై కత్తితో దాడి..
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమ్రాన్ షా మృతి చెందాడు. మృతుడు బిహార్ వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.