తెలంగాణ

telangana

ETV Bharat / crime

టీవీ మీదపడి.. రెండేళ్ల చిన్నారి మృతి - hyderabad crime news

టీవీ మీదపడటంతో గాయాలైన ఓ రెండేళ్ల చిన్నారి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన బంజారాహిల్స్​ పరిధిలో చోటుచేసుకుంది.

టీవీ మీదపడి.. రెండేళ్ల చిన్నారి మృతి
టీవీ మీదపడి.. రెండేళ్ల చిన్నారి మృతి

By

Published : May 19, 2022, 8:37 AM IST

ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై టీవీ పడి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఫస్ట్‌లాన్సర్‌ సమీపంలోని అహ్మద్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తూ వడ్రంగిగా పని చేసే మహ్మద్‌ లయీఖుద్దీన్‌ రెండేళ్ల కుమార్తె మెహరాజ్‌ ఫాతిమా.. ఈ నెల 12న ఇంట్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు టీవీ చిన్నారి మీదపడింది. ఘటనలో చిన్నారి గాయపడగా.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details