ట్యూషన్ టీచర్ ఓ బాలుని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. హోంవర్క్ సరిగా చేయడంలేదని చితకబాదింది. బాలునికి ఒళ్లంతా వాతలు పడడంతో బాలుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది.
8 ఏళ్ల బాలుడిని చితకబాదిన ట్యూషన్ టీచర్... పోలీసులకు ఫిర్యాదు - బాలుడిని కొట్టిన ట్యూషన్ టీచర్
14:49 August 17
బాలుడిని చితకబాదిన ట్యూషన్ టీచర్
కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడడం వల్ల బాపూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన 8ఏళ్ల కుమారుడిని వెంగళరావునగర్‌లో ఉంటున్న విజయలక్ష్మి వద్ద ట్యూషన్‌కు పంపుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు హోంవర్క్ సరిగా చేయకపోవడంతో ఆమె... బాలుడిని చితకబాదింది. కుమారుడి ఒంటిపై దెబ్బలను చూసిన బాలుడి తండ్రి...పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మా బూబును రెండు నెలలుగా విజయలక్ష్మి వద్దకు ట్యూషన్‌కు పంపిస్తున్నాము. అప్పటి నుంచి పిల్లాడు భయం భయంగానే ఉంటున్నాడు. మొన్న ఓరోజు బాబు ఒళ్లంతా వాతలు పడి ఉండడం చూశాము. ఏమైందని అడిగితే.. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టిందని చెప్పాడు. బాబును ఆస్పత్రిలో చూపించి.. టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాము. -బాలుడి తండ్రి
ఇదీ చూడండి:Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు