తెలంగాణ

telangana

ETV Bharat / crime

హాస్టల్‌ విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఇద్దరు మృతి, మరొకరికి..! - rangampet accident news

హాస్టల్‌ విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఒకరు మృతి, మరో ఇద్దరికి..!
హాస్టల్‌ విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఒకరు మృతి, మరో ఇద్దరికి..!

By

Published : Jun 28, 2022, 2:24 PM IST

Updated : Jun 28, 2022, 5:04 PM IST

14:22 June 28

హాస్టల్‌ విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఇద్దరు మృతి, మరొకరికి..!

హాస్టల్‌ విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఇద్దరు మృతి, మరొకరికి..!

ట్రాక్టర్​ బీభత్సంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్​ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు పాఠశాల నుంచి హాస్టల్​కు నడుచుకుంటూ వెళ్తుండగా.. ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో విద్యార్థుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతులు రజనీకాంత్, జశ్వంత్​గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మెదక్ పట్టణం గోల్కొండ వీధికి చెందిన శివాయిపల్లి రాజు, పోచమ్మ దంపతుల ఏకైక కుమారుడు జశ్వంత్ (15), నర్సిఖేడ్​కు చెందిన తుర్పట్ల శంకర్, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు రజనీకాంత్(13)లు కొల్చారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి, 8వ తరగతి చదువుతూ స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. రోజూ మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. తలనొప్పి కారణంగా మరో విద్యార్థి రామ్​చరణ్​ను వెంటబెట్టుకుని వసతి గృహానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే రంగంపేట వైన్స్​ దాటగానే.. వెనక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఘటనలో జశ్వంత్​ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా రజనీకాంత్​ చనిపోయాడు. రామ్​చరణ్​ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతదేహంతో ఆందోళన..: వసతి గృహ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే జశ్వంత్​ మృతదేహంతో సుమారు గంటసేపు ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై సంతోశ్​రెడ్డి, కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్​లు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అన్నను చంపించిన చెల్లెలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

స్టార్ హీరో కుమారుడి హల్​చల్.. పదేళ్ల వయసుకే స్పోర్ట్స్ కార్​ నడిపి యాక్సిడెంట్

Last Updated : Jun 28, 2022, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details