తెలంగాణ

telangana

ETV Bharat / crime

పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌ - cp sajjanar speech

నిజామాబాద్ జిల్లా బోదన్ పాస్‌పోర్ట్ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. పాస్‌పోర్టు కేసులో ఇప్పటివరకు 8 మంది అరెస్ట్ అయినట్లు తెలిపారు.

A total of 8 people have been arrested in the Bodhan passport scam
పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

By

Published : Feb 22, 2021, 7:14 PM IST

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నకిలీ పాస్‌పోర్టు కుంభకోణంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇప్పటివరకు మెుత్తం 8 మందిని అరెస్టు చేయగా... ఇందులో నలుగురు బంగ్లాదేశీయులు, ఒక బంగాల్ వాసితోపాటు మరో ఏజెంట్‌ ఉన్నారు. వీరికి సహకరించిన ఇద్దరు స్పెషల్ బ్రాంచ్‌ అధికారులను అరెస్టు చేసినట్లు వివరించారు.

ఒకే చిరునామాతో 32 పాస్‌పోర్టులు జారీ కాగా... మెుత్తం 72 నకిలీ పాస్‌పోర్టులు గుర్తించినట్లు సీపీ తెలిపారు. వీరిలో ఎంతమంది దేశం దాటి వెళ్లారు? ఇంకా ఎంతమంది పాస్‌పోర్టు పొందారు అన్నదానిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో రోహింగ్యాలు లేరని స్పష్టం చేశారు. దీనిపై ఇమ్మిగ్రేషన్, రీజనల్ పాస్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని... కస్టడీకి తీసుకొని విచారిస్తామని సీపీ పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్టుల కేసులో అధికారులు, పోలీసులు, స్థానికుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సజ్జనార్‌ వివరించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details