తెలంగాణ

telangana

ETV Bharat / crime

MURDER: తండ్రినే హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే! - తెలంగాణ వార్తలు

కన్నతండ్రినే అతి దారుణంగా హతమార్చాడు(MURDER) ఓ కుమారుడు. విధులకు వెళ్లొచ్చిన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న తండ్రిని ఇంట్లో ఉంచి... తాళం వేసి పరారయ్యాడు. ఆ తర్వాత ఒక్క ఫోన్‌కాల్‌తో విషయం బయటపడింది.

son murdered father, son stabbed father
తండ్రినే హతమార్చిన కుమారుడు, తండ్రిని పొడిచిన కుమారుడు

By

Published : Aug 23, 2021, 4:15 PM IST

Updated : Aug 23, 2021, 5:59 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీ క్వార్టర్ 658లో సింగరేణి ఉద్యోగి నాగభూషణం నివాసం ఉంటూ భూపాలపల్లి ఒకటో గనిలో ట్రామర్‌గా పనిచేసేవారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన భార్య 2019లో మృతి చెందగా... గతేడాది రెండో వివాహం చేసుకున్నారు. ఫలితంగా మొదటి భార్య పిల్లలు తండ్రిపై ద్వేషాన్ని పెంచుకున్నారు.

రెండో వివాహం

ఆరు నెలల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. నాగభూషణం ఆయన రెండో భార్య బంధవుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు వెళ్లి... ఆదివారం భూపాలపల్లికి వచ్చినట్లు పేర్కొన్నారు. విధులకు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలోనే ఆయన కుమారుడు జగదీశ్, రెండో కూతురు మహేశ్వరి వచ్చారని వెల్లడించారు. రాత్రి ఏం జరిగిందో కానీ తండ్రిని అతి కిరాతంగా కత్తితో పొడిచి చంపినట్లు వివరించారు.

ఫోన్ కాల్​తో విషయం వెలుగులోకి..

తండ్రిని హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారని... అనంతరం జగదీశ్ తన బావకు ఫోన్ చేసి విషయం చెప్పారని పోలీసులు తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలికి వెళ్లినట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన నాగభూషణం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి:robbery: జ్యువెలరీ షాపులో చోరీ... ఏం ఎత్తుకుపోయారంటే..!

Last Updated : Aug 23, 2021, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details