తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాల్​గర్ల్ కోసం వెతికి.. సైబర్‌ నేరగాడికి చిక్కిన టెకీ

Hyderabad techie was cheated by cyber criminals: ఆన్​లైన్​లో కాల్​గర్ల్​ కోసం వెతికిన ఓ ఐటీ ఉద్యోగికి అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఫొటో చూసి తనే కావాలని ఆశపడ్డాడో.. లేక పేరు చూసి మైకంలో పడ్డాడో తెలియదు గానీ.. బుకింగ్​ కోసం విడతల వారిగా డబ్బులు పంపాడు. అలా రూ.1.97లక్షలు పంపి చివరకు పోలీసులను చెంతకు చేరాడు. కాల్​గర్ల్​ కోసం వెతికి పోలీసులు వద్దకు ఎందుకు వెళ్లాడు అనుకుంటున్నారా..?

Fraud in Calgirl
Fraud in Calgirl

By

Published : Jan 5, 2023, 9:33 AM IST

Updated : Jan 5, 2023, 11:04 AM IST

Hyderabad techie was cheated by cyber criminals: వేశ్య కోసం ఆన్‌లైన్‌లో వెతికిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సైబర్‌ నేరగాడి చేతిలో పడి రూ.1.97 లక్షలు పోగొట్టుకున్నాడు. చందానగర్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్‌ కోసం(ఎస్కార్ట్‌ సర్వీస్‌) వెతికాడు. ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్‌ చేయగానే వాట్సాప్‌ నంబరు దొరికింది. పటేల్‌ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్‌ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు.

Cyber crime: బుకింగ్‌ కోసం రూ.510, తరువాత రూ.5,500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 5, 2023, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details