నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో మహిళతో పాటు రెండు గేదెలు మృతి చెందాయి. స్థానికంగా నివసించే దైద లచ్చమ్మ(55).. గేదెలను మేపే సమయంలో రోడ్డు దాటుతుండగా, మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. లచ్చమ్మకు భర్త, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
లారీ బీభత్సం.. మహిళ, రెండు గేదెలు మృతి - road accident took place in Vemulapalli mandal
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ మహిళతో పాటు, రెండు గేదెలు మృతి చెందాయి.
![లారీ బీభత్సం.. మహిళ, రెండు గేదెలు మృతి accident in vemulapally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11154104-4-11154104-1616668473233.jpg)
వేములపల్లి, రోడ్డు ప్రమాదం
ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వేములపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.