నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం సమీపంలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం... ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కొందరు సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. అందులో ఓ చిన్నారి మృతిచెందింది. గల్లంతైన ఐదుగురికోసం గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడింది.
nellore accident: ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు - సంగం వద్ద రోడ్డు ప్రమాదం
21:48 December 09
nellore accident: ఆటోను ఢీకొన్న లారీ.. వాగులో కొట్టుకుపోయిన ప్రయాణికులు
ఐదుగురి కోసం గాలిస్తున్నాం: ఎస్పీ విజయారావు
సంగం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. స్థానికుల సహకారంతో ఏడుగురిని కాపాడామని, గల్లంతైమన ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. బోట్లు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలి వద్ద పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఇదీచూడండి:హెలికాప్టర్ క్రాష్: పార్థివదేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం!