తెలంగాణ

telangana

ETV Bharat / crime

లెబనాన్​ వెళ్లి వస్తుండగా.. జైలుకు జగిత్యాల వాసి.! - A resident of Jagtial district who went abroad for employment has been jailed

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జగిత్యాల జిల్లా వాసి జైలు పాలయ్యాడు. మూడేళ్ల క్రితం లెబనాన్​ వెళ్లిన అతను.. స్వదేశానికి తిరిగి వస్తున్న క్రమంలో పాత కేసు బయటపడటంతో ఇమ్మిగ్రేషన్​ అధికారులు జైలుకు పంపించారు.

lebanon, jagtial, jagtial resident arrested in dubai
జగిత్యాల, లెబనాన్​, దుబాయ్​లో జగిత్యాల వాసి అరెస్ట్​

By

Published : Mar 29, 2021, 12:37 PM IST

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ ఉపాధి కోసం లెబనాన్ వెళ్లి జైలు పాలయ్యాడు. 2018లో వీసా పొంది లెబనాన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లాడు. విశ్రాంతి కోసం షార్జా మీదుగా స్వదేశానికి తిరిగి వస్తున్న క్రమంలో దుబాయ్​లో అతనిపై పాత కేసు వెలుగు చూసింది. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు.

కొడుకు ఇంటికి వస్తాడని..

తెల్లవారితే తమ కుమారుడు ఇంటికి వస్తాడని ఆశగా శ్రీనివాస్​ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో అతని నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో భార్య, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన కుమారుడు గతంలో ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లిన మాట వాస్తవమేనని శ్రీనివాస్​ తల్లి వెల్లడించింది. దానికి శిక్ష అనుభవించాడని.. అనంతరం ఉపాధి కోసం విదేశానికి వెళ్లాడని తెలిపింది. మూడేళ్ల తర్వాత తమను చూడటానికి వస్తున్న కుమారుడిపై మళ్లీ పాత కేసు తోడటం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్​ విడుదలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం.. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

లెబనాన్​ వెళ్లి వస్తుండగా.. జైలుకు జగిత్యాల వాసి.!

ఇదీ చదవండి:మైల్వార్‌ అడవిలో వేటగాళ్లు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details