ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెందిన ఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బొల్లారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నవీన్‌రెడ్డి మృతదేహం కౌకూర్ చెరువు వద్ద ఉన్న చెట్లపొదల్లో పోలీసులకు లభించింది. నవీన్ రెడ్డి ఈ నెల 5 నుంచి అదృశ్యమైనట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
స్థానికుల సమాచారం మేరకు ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పుల బాధతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.