తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్ - భూపాల పల్లి నేర వార్తలు

సరుకులు తీసుకోడానికి వచ్చిన లబ్ధిదారుడిపై రేషన్​ డీలర్​ చేయిచేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ మండలం ఎలికేశ్వరంలో జరిగింది.

లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్
లైవ్​ వీడియో: లబ్ధిదారుడిపై చేయి చేసుకున్న రేషన్ డీలర్

By

Published : Feb 4, 2021, 7:48 AM IST

Updated : Feb 4, 2021, 8:55 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరంలోని రేషన్ దుకాణంలో లబ్ధిదారుడిపై రేషన్​ డీలర్​ చేయిచేసుకున్నాడు. వేలిముద్రలకు బదులుగా ఐరీస్​, ఓటీపీ ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నారు. బుధవారం రాత్రి వరకు ఇది కొనసాగింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన గాడిపళ్లి మధుకర్​ బియ్యం తూకంలో వ్యత్యాసం ఉందని డీలర్​ను అడిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో మధుకర్​పై రేషన్​ డీలర్​ చేయిచేసుకున్నాడు.

లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్

బాధితుడు మహదేవపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. డీలర్​ కొండల్​రెడ్డి... దుర్భాషలాడుతూ, కొట్టినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుడిపై చేయిచేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:ఆటో ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి

Last Updated : Feb 4, 2021, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details