ఓ వైపు సమస్యలు పరిష్కరించాలని విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. జగిత్యాల జిల్లా పొలాసలో విద్యుత్ ఉద్యోగి ఏబీ రాజు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వేల మంది ఆర్టీజెన్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింప జేయాలని సూసైట్ నోట్లో పేర్కొన్నాడు.
విద్యుత్ ఉద్యోగి మృతి, సూసైడ్ నోట్ లభ్యం
జగిత్యాల జిల్లాలో ఓ విద్యుత్ ఉప కేంద్రం ఆపరేటర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్మికులకు ఆర్టీజెన్ ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింప జేయాలని సూసైట్ నోట్ లభ్యమైంది.
విద్యుత్ ఉద్యోగి మృతి, సూసైడ్ నోట్ లభ్యం
ఆపరేటర్ ఏబీరాజు ఆత్మహత్య చేసుకోవటంతో విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు మృ దేహం వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:''మోదీ దుకాణం'లో ఔషధాలు కొనండి'