Cyber Fraud: ప్రాణ స్నేహితుడని నమ్మితే రూ.12.5 లక్షలు దోచేశాడంటూ ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ కథనం ప్రకారం.. ఎస్సార్నగర్కు చెందిన ఓ వ్యక్తికి కిశోర్ అనే స్నేహితుడు ఉన్నాడు. అతను ఓ క్రిప్టో వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు మొదట కొంత డబ్బుతో క్రిప్టో కొనుగోలు చేశారు.
ప్రాణ స్నేహితుడని నమ్మితే.. రూ.12.5 లక్షలు స్వాహా - telangana latest news
Cyber Fraud: ప్రాణ స్నేహితులు ఏం చెప్పినా ఆలోచించకుండా చేసేస్తాం. దానినే ఆసరాగా చేసుకుని రూ.12.5 లక్షలకు టోకరా వేశాడు ఓ స్నేహితుడు. ఆలస్యంగా అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Fraud
దానికి లాభాలు వచ్చాయి. తర్వాత ఇంకా డబ్బు పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చి రూ.12.5 లక్షలు దోచేశాడు. తర్వాత బాధితుడి ఖాతా నిలిపివేశాడు. తరువాత తన స్నేహితుడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: