Suicide infront of police station: పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. బైరగోని తిరుపతి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్‌లో డబ్బుల విషయంలో తేడా రావడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు పురుగుల మందు తాగుతున్న తిరుపతిని అడ్డుకొని హుటాహుటిన 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో తిరుపతి తన తల్లి పేరు మీద ఉన్న 4ఎకరాల 19గుంటల భూమిని తన సమీప బంధువుకు కోటి రూపాయలకు అమ్మదలచుకున్నాడు. అందుకుగానూ అతని దగ్గర నుంచి బాధితుడు 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బులకు నోటరీ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితుడు తిరుపతి తెలిపాడు. పెట్టుకున్న గడువు ముగిసి రెండు మూడు నెలలు గడుస్తున్న మిగిలిన 84 లక్షల రూపాయలను ఇవ్వలేదు.