తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆస్తి వివాదం.. సొంత అన్ననే అతి కిరాతకంగా హతమార్చాడు - నిజామాబాద్​ జిల్లా వార్తలు

ఆస్తి తగాదాలు రక్తసంబంధాలను బలితీసుకుంటున్నాయి. డబ్బు కోసం తోడబుట్టిన వాళ్లనే అతి కిరాతకంగా హతమారుస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా అంబం గ్రామంలో ఆస్తి గొడవల్లో సొంత అన్ననే పొట్టనపెట్టుకున్నాడు ఓ తమ్ముడు.

brother murdered in land disputes
ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు

By

Published : May 9, 2021, 8:21 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో అన్నను సొంత తమ్ముడే అతి కిరాతకంగా చంపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్​​ ఇటీవలే విదేశాల నుంచి సొంత ఊరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి తమ్ముడు నరేందర్​తో ఆస్తి విషయంలో గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో క్షణికావేశానికి గురైన నరేందర్​.. శ్రీనివాస్​ ముఖంపై కర్రతో గాయపరిచాడు. అనంతరం ఛాతీ, గొంతూపై కాలితో తొక్కి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కాగజ్​నగర్​లో దొంగల చేతివాటం.. ఏడున్నర తులాల బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details