తెలంగాణ

telangana

ETV Bharat / crime

Heart stroke on bike: బైక్​పై వెళ్తుండగా గుండె పోటు.. ఆస్పత్రికి వెళ్లే లోపే.. - a person got heart stroke on bike

చావు ఎప్పుడు, ఏ సమయంలో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఈ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి వెళ్లే లోపే దారిలోనే కుప్పకూలిపోయాడు(Heart stroke on bike) ఓ యువకుడు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Heart stroke on bike
బైక్​పై గుండె పోటు

By

Published : Nov 20, 2021, 2:37 PM IST

అస్వస్థతకు గురైన యువకుడిని చికిత్స కోసం ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తుండగా.... ప్రాణాలు(Heart attack on bike) విడిచాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన... అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. పండ్ల రాజు అనే యువకుడు ఉన్నట్లుండి ఉదయం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. గుండెపోటు(heart attack) వచ్చినట్లు ఈసీజీలో వైద్యులు గుర్తించారు.

అనంతరం ఇంటికి వెళ్లిన రాజు విశ్రాంతి తీసుకోగా... మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తన స్నేహితుడు తన బైక్‌పై తీసుకువెళ్తుండగా... గాంధీ చౌరస్తా(Heart stroke on bike) వద్ద కిందపడిపోయాడు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. జరిగిన సంఘటన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డవడంతో ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

ఇదీ చదవండి:ORR Accident Hyderabad Today :ఓఆర్​ఆర్​ వద్ద అమెరికా తరహా ప్రమాదం.. ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ

ABOUT THE AUTHOR

...view details