A person died of a heart attack: మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి కుమారుడు కావల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమన్నారు. గుండెపోటుతో యువకుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణంలోని రావుల శంకరయ్య చారి, భూలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన సత్యనారాయణాచారి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని ఉట్నూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.