లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక నగరంలో మరో యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్లో నివాసముండే రాజేశ్ సోమవారం ఉరి వేసుకొని మృతి చెందాడు. భార్య, మూడు సంవత్సరాల కూతురుతో కలిసి నివాసం ఉంటున్న రాజేశ్ బిగ్ బాస్కెట్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య స్వగ్రామం విజయవాడ వెళ్లగా.. ఇంటికి కొరియర్ రావడంతో భార్య.. రాజేశ్‌కు ఫోన్ చేసింది.
భర్త ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్‌మెన్‌కు ఫోన్ చేయగా.. ఇంట్లో గడియ పెట్టి ఉండటంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కి ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తిం గాంధీ ఆసుపత్రికి తరలించారు.