తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెక్​ డ్యామ్​లో పడి యువకుడు మృతి

చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో చోటు చేసుకుంది. మృతుడు కృష్ణాజిల్లాకు చెందిన సాయివంశీ(24)గా గుర్తించారు. బోడకొండ జలపాతం చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

A person died in check dam at bodakonda water falls
చెక్​ డ్యామ్​లో పడి యువకుడు మృతి

By

Published : Oct 3, 2021, 10:01 PM IST

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ జలపాతం వద్ద చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బుర్ర సాయివంశీ(24)గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై మంచాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతంరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా మరేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి:Godavari River: గోదావరిలో ఇద్దరు గల్లంతు.. నలుగురు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details